Namaste NRI

తప్పకుండా అందరికీ నచ్చే సినిమా : లేలీధర్‌రావు

జేపీ నవీన్‌, శ్రావణి శెట్టి జంటగా నటించిన చిత్రం ఏ ఎల్‌ సి సి (ఓ యూనివర్సల్‌ బ్యాచిలర్‌). లేలీధర్‌రావు కోలా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. లేలీధర్‌రావు మాట్లాడుతూ ఇది ఇష్టంతో తీసిన సినిమా. ఈ సినిమా కోసం మా టీమ్‌ ఎంతో కష్టపడింది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది అని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తమకు అవకాశం ఇచ్చినందుకు గాను హీరోహీరోయిన్లు నవీన్‌, శ్రావణి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా అతిథులుగా విచ్చేసిన దర్శకులు వి.సముద్ర, నగేష్‌ నారదాసి కూడా మాట్లాడారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events