Namaste NRI

ఘనంగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ కర్టెన్ రైజర్

ఈవెంట్సంతోషం సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌, సంతోషం ఓటీటీ అవార్డ్స్‌ 2025 కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సీనియర్‌ నటుడు మురళీమోహన్‌, నిర్మాత కేఎస్‌ రామారావు, కాజా సూర్యనారాయణ, నిర్మాత ఏడిద రాజా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొని సంతోషం పాత్రికాధినేత సురేశ్‌ కొండేటికి శుభాకాంక్షలు అందించారు. ప్రతి ఏటా ఘనంగా జరిగే సంతోషం అవార్డుల వేడుక ఈ ఏడాది కూడా జనం మెచ్చేలా జరగాలని వారంతా ఆకాక్షించారు.

24ఏండ్లుగా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్న ఏకైక మేగజైన్‌ సంతోషం అని, సురేష్‌ కొండేటి ఎంతో కష్టానష్టాలకోర్చి ఈ పత్రికను ముందుకు తీసుకెళ్లడమే కాక, అవార్డు వేడుకలను కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నారని మురళీమోహన్‌ కొనియాడారు. సురేశ్‌ కొండేటి మాట్లాడుతూ 35ఏండ్లుగా జర్నలిస్ట్‌గా ఉన్నాను. విలువలతో పత్రిక పెట్టి, పలువురు హర్షించేలా ముందుకెళ్తున్నాను. ఇక ముందు కూడా ఈ విలువలను వదులుకోను. పరిశ్రమ మెచ్చేలా వేడుక నిర్వహిస్తాం  అని సురేశ్‌ కొండేటి అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events