Namaste NRI

యూఎస్‌ఏఐడీలో భారతీయ అమెరికన్ కు కీలక పదవి

యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ ఏఐడీ)అనుబంధ బ్యూరో ఫర్ హ్యూమని టేరియన్ అసిస్టెన్స్‌ అడ్మినిస్ట్రేటర్‌కి అసిస్టెంట్‌గా భారతీయ అమెరికన్ సోనాలి కోర్డే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేటర్ సమంత పవర్ మాట్లాడుతూ మనందరికీ సోనాలి ఒక బహుమతి వంటివారని శ్లాఘించారు. ఆమెలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయని పేర్కొన్నారు.  కోర్డే తల్లిదండ్రులు భారత్ నుంచి వలస వచ్చారని, వారి పెంపకమే అద్బుతంగా సోనాలిని తీర్చి దిద్దిందని ప్రశంసించారు. సోనాలి యేల్ యూనివర్శిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎంఎ, న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఎస్ పట్టా పొందారు. గతంలో అడ్మినిస్ట్రేటర్‌కు డిప్యూటీ అసిస్టెంట్‌గా ఉన్న సమయంలో గాజాలో మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి కృషి చేశారు. జాతీయ భద్రతా మండలిలో గ్లోబల్ హెల్త్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2005 నుంచి 2013 వరకు యూఎస్‌ఎఐడి బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్‌లో ప్రెసిడెంట్స్ మలేరియా ఇనీషియేటివ్‌కు సీనియర్ సాంకేతిక సలహాదారుగా సేవలు అందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events