సుమన్‌తేజ్, గరీమ చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం సీతా కల్యాణ వైభోగమే. సతీష్ పరమవేద దర్శకత్వం. యుగంధర్ నిర్మిస్తున్నారు. ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, నిర్మాత విజయ్ కనకమేడల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ఆడపిల్ల ఉండే ప్రతీ కుటుంబానికి ఈ సినిమా నచ్చుతుంది. చక్కటి ప్రేమకథతో పాటు నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించాం. భావోద్వేగభరితంగా సాగుతూ ప్రేక్షకులకు మంచి సందేశాన్నంది స్తుంది అన్నారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని, యువతరంలో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే అన్ని అంశాలుంటాయని నిర్మాత తెలిపారు. పాటలు మెలోడీ ప్రధానంగా అందరికీ నచ్చుతా యని సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అన్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది.