అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ హుషారు పిట్టలు. బిక్షు దర్శకుడు. వెంకట్ యాదవ్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు కలిసి విడుదల చేస్తున్నాయి. టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అగ్ర నిర్మాత డి.సురేశ్‌బాబు టీజర్‌ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

దర్శకుడు బిక్షు మాట్లాడుతూ ఇది యువతీయువకులు, వారి తల్లిదండ్రులు విడివిడిగా చూడాల్సిన కుటుంబకథ. నా రియల్‌లైఫ్‌లో నా చుట్టుపక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను. చూసినవారంతా థ్రిల్ల్ అవుతారు అని చెప్పారు. ఎంతో ఇష్టపడి నిర్మించిన సినిమా ఇదని, చేసే పనిలో నిజాయితీ ఉంటే విజయం అదే వస్తుందని నమ్మి ఈ సినిమా చేశామని, యువతకు, తల్లిదండ్రులకు మంచి సందేశం ఈ సినిమా అని నిర్మాత వెంకట్ యాదవ్ అన్నారు.















