Namaste NRI

బే ఏరియాలో మ్యూజికల్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్

అమెరికాలోని బే ఏరియాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీల ఆధ్వర్యంలో మ్యూజిక్ ఫెస్టివల్ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఘనంగా జరిగింది. బే ఏరియాలోని సంగీత ప్రియులను టాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన ఆటపాటలతో కట్టిపడేశారు. హేమచంద్ర, పృథ్వీ, సాగర్, మంగ్లీ, రీటా, మౌనిక, ఇంద్రావతి చౌహాన్‌ల బృందం బే ఏరియాలోని సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నటి అనసూయ యాంకర్‌గా వ్యవహరించారు. ఈ మ్యూజికల్ ఫెస్టివల్‌కు దాదాపు 3,500 మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. 4 గంటల పాటు నాన్‌స్టాప్‌గా తెలుగు పాటలతో బే ఏరియా మార్మోగిపోయింది. ఇటీవలి కాలంలో ఈ తరహా మ్యూజిక్ ఈవెంట్ జరగలేదని, ఈ ఈవెంట్ అత్యుత్తమమైనదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. పక్కా ప్రణాళికతో పాటు నిర్వాహుకుల కృషి వల్లే ఈ ఈవెంట్ మెగా హిట్ అయిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

శివ కాడా (వైస్ ప్రెసిడెంట్), వరుణ్ ముక్కా(సెక్రటరీ), హరి సన్నిధి (జాయింట్ సెక్రటరీ)లతో కూడిన బాటా కమిటీ, రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరిలతో కూడిన స్టీరింగ్ కమిటీ,  శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తిలతో కూడిన సాంస్కృతిక కమిటీ,  సురేష్ శివపురం, రవి పోచిరాజులతో కూడిన లాజిస్టిక్స్ టీమ్,  సందీప్ కె.సంకేత్, ఉదయ్, ఆదిత్య, సందీప్, గౌతమి, హరీష్ లతో కూడిన యూత్ కమిటీ ని కొండల్ కొమరగిరి ప్రేక్షకులకు పరిచయం చేశారు.

 ఈ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసిన బాటా బృందాన్ని, వాలంటీర్లను జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటిలతో కూడిన బాటా  అడ్వయిజరీ బోర్డు అభినందించింది. ఇక ఈ ఈవెంట్‌‌కు గ్రాండ్ స్పాన్సర్ రియల్టర్  నాగరాజ్ అన్నయ్య పవర్డ్ బై యు స్మైల్ డెంటల్, గోల్డ్ స్పాన్సర్లు: Mealo యాప్ & స్ట్రైవ్ ఏవియేషన్, ఫుడ్ స్పాన్సర్: కేక్స్ బేక్స్ వ్యవహారించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు విశేష కృషి చేసిన బాటా సభ్యులను టీ.జీ. విశ్వ ప్రసాద్  (పీపుల్ మీడియా) అభినందించారు.  ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చిన స్పాన్సర్లకు వేదికపై నుంచి పేరుపేరునా  బాటా కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress