రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పురుషోత్తముడు. రామ్ భీమన దర్శకత్వం. ఈ చిత్రాన్ని డా॥ రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, ముఖేష్‌ఖన్నా వంటి ఆర్టిస్టులు ఈ కథకు మరింత బలాన్ని తీసుకొచ్చారు. కోటీశ్వరుడైన ఓ యువకుడు పల్లెటూరికి ఎందుకొచ్చాడు ? అతని లక్ష్యమేమిటన్నదే చిత్ర కథాంశం. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌ప్లే రానటువంటి వినూత్నమైన పాయింట్‌తో తెరకెక్కించాం అన్నారు.
నిర్మాత డా॥ రమేష్ తేజావత్ మాట్లాడుతూ నేను ముంబయిలో వ్యాపా రం చేస్తుంటా. ఓ మంచి తెలుగు సినిమా తీయాలనే కోరిక ఈ ప్రాజెక్ట్‌తో నెరవేరింది. పేరున్న ఆర్టిస్టులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ తో ఈ సినిమా తీశాం. సకుటుంబ సమేతంగా హాయిగా చూసేలా ఉంటుంది అన్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది.