అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ ఫ్లర్ట్ వేగంగా వ్యాపిస్తున్నది. ఇది రోగ నిరోధక శక్తికి లొంగకుండా తప్పించు కోగలదని నిపుణులు భావిస్తున్నారు. దీన్ని ఒమిక్రాన్‌లో సబ్ వేరియెంట్‌గా పేర్కొన్నారు. బ్రిటన్, న్యూజిలాం డ్, దక్షిణ కొరియా దేశాల్లో ఐరిస్ వేరియెంట్ స్థానాన్ని ఫ్లర్ట్ భర్తీ చేస్తున్నదని సీకే బిర్లా దవాఖాన వైద్య నిపుణు లు రాజీవ్ గుప్తా చెప్పారు.కొత్త వేరియంట్ వల్ల మరణాల రేటు మాత్రం తక్కువగానే ఉన్నది అని గుప్తా అన్నారు. గొంతు నొప్పి, దగ్గు, తీవ్రమైన అలసట, జలుబు, తలనొప్పి, కండరాల నొప్పులు, రుచి, వాసన కోల్పోవటం వంటి రోగ లక్షణాలే ఫ్లర్ట్ లోనూ కనిపిస్తున్నాయి.