టెలిగ్రాం వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వీర్య దానంతో జన్మించిన వంద మంది పిల్లలకు సంపదను సమంగా పంచుతానని చెప్పారు. అయితే వారికి 30 ఏండ్లు వచ్చే వరకు మాత్రం సంపదపై హక్కు లభించబోదని స్పష్టం చేశారు. తనకు ముగ్గురు జీవిత భాగస్వాములతో ఆరుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు.

అయితే పదిహేనేండ్లుగా తాను వీర్యదానం చేస్తున్నట్టు, తద్వారా 100 మంది పిల్లలు పుట్టినట్టు ప్రకటించారు. అయితే వీరందరినీ ఒకేలా చూస్తానని, ఎలాంటి వ్యత్యాసం ఉండదని చెప్పారు. తన సంపదపై వీరిందరికీ సమాన హక్కు దక్కుతుందని ప్రకటించారు. అయితే 30 ఏండ్ల వరకు తన సంపద తన పిల్లలు ముట్టుకోకుండా వీలునామా రాసినట్టు తెలిపారు. ప్రస్తుతం పావెల్ దురోవ్ సంపద దాదాపు రూ.1.4 లక్షల కోట్లు.
