
కెనడా లో భారతీయ విద్యార్థిని మృతి చెందింది. ఉన్నత చదువులకోసం వెళ్లిన విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆమె మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. విద్యార్థినిని ఢిల్లీ కి చెందిన తన్యా త్యాగిగా అధికారులు గుర్తించారు. ఆమె కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటోంది. ఈ విషయాన్ని వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ధ్రువీకరించింది. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియదని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తన్యా త్యాగి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చింది.
