
అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభకు భారత సంతతికి చెందిన డాక్టర్ ప్రశాంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున కాన్సాస్ నుంచి బరిలో నిలిచారు. 2018 నుంచి వరుసగా మూడుసార్లు ఈ స్థానం నుంచి డెమొక్రటిక్ పార్టీ నుంచి ఎన్నికైన షరీస్ డేవిడ్స్‌పై ఆయన పోటీ చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన డాక్టర్ ప్రశాంత్‌రెడ్డికి స్పీకర్ మైక్ జాన్సన్‌తోపాటు రిపబ్లికన్ పార్టీ నాయకులు మద్దతు ఇస్తున్నారు. ఆగస్టు 6న ఎన్నికలు జరుగనున్నాయి.
..
