అమెరికాలోని టెక్సాస్‌లో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హూస్టన్ సమీపంలో ఆ మహావిగ్రహాన్ని ఆవిష్కరించారు. 90 ఫీట్ల ఎత్తైన ఆ విగ్రహం, అమెరికా ఆధ్యాత్మిక, సాంస్కృతిక విపణిలో కొత్త మైలురాయి అవుతుందని పేర్కొన్నారు. హూస్టన్‌లో ఉన్న ఈ విగ్రహం ఎన్నో మైళ్ల దూరం నుంచి కనిపిస్తున్నది. అమెరికా లో ఉన్న మూడవ అతిపెద్ద విగ్రహంగా రికార్డు క్రియేట్ చేసింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ(151 ఫీట్లు), ఫ్లోరిడాలోని హల్లండేలా బీచ్‌లో పెగాసస్-డ్రాగన్(110 ఫీట్లు) విగ్రహం తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
సుగర్ ల్యాండ్‌లో ఉన్న అష్టలక్ష్మీ ఆలయంలో హనుమాన్ మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆగస్టు 15 నుంచి 18 వరకు జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో దీన్ని ఓపెన్ చేశారు. సీతా రాములను ఒక్కటి చేయడం లో హనుమంతుడు కీలక పాత్ర పోషించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. శ్రీ చిన్న జీయర్ స్వామిజీ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓపెనింగ్ కార్యక్రమం సమయంలో హెలికాప్టర్ ద్వారా పువ్వు లు, పవిత్ర జలాన్ని చల్లారు. హనుమంతుడి మెడలో 72 ఫీట్ల పూలమాలను వేశారు. అమెరికా ఆధ్యాత్మిక, సాంస్కృతిక జగత్తులో ఈ విగ్రహం ఓ మైలురాయిగా నిలుస్తుందని నిర్వాహకులు చెప్పారు.