Namaste NRI

అగ్రరాజ్యం లో భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం

అగ్రరాజ్యం అమెరికాలో ఇండియన్ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియన్ అమెరికన్‌ను కీలక పదవికి నామినేట్ చేశారు. భారత సంతతికి చెందిన డాక్టర్ రవి చౌదరిని ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా బైడన్ నామినేట్ చేశారు. డాక్టర్ రవి చౌదరిని అసిస్టెంట్ సెక్రటరీగా బైడెన్ నామినేట్ చేసిన సమాచారం సోమవారం సెనేట్ కూడా చేరింది. ఈ నియామకానికి సెనేట్ ఆమోదముద్ర వేస్తే.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా డాక్టర్ రవి చౌదరి బాధ్యతలు స్వీకరిస్తారు. 

1993 నుంచి 2015 వరకూ రవిచౌదరి వివిధరకాల స్థాయిలలో వ్యవహరించారు. తొలిదశలో సి 17 పైలెట్ బాధ్యతల్లో ఉన్నప్పుడు రవిచౌదరి అమెరికా తరఫున పలు ప్రపంచ స్థాయి వైమానిక మిషన్లల్లో పాల్గొన్నారు. అఫ్ఘనిస్థాన్, ఇరాక్‌లలో పలు సార్లు అమెరికా యుద్ధ విమానాల ద్వారా దాడుల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. నిర్వాహక బాధ్యతలతో పాటు, ఇంజనీరింగ్, సీనియర్ స్టాఫ్ నియామకాలలో ప్రధాన పాత్ర పోషించారు. ఫ్లెయిట్ టెస్ట్ ఇంజనీరుగా సైనిక విమానాల సమర్థత, ప్రమాణికతల దిశలో కీలక చర్యలు చేపట్టారు. ఎయిర్‌ఫోర్సు ఆధునీకరణ కార్యక్రమాలకు అవసరం అయిన హార్డ్‌వేర్ రూపకల్పనతో యుద్ధ విమానాల సమర్థత, భద్రతకు పాటుపడ్డారు. తనకున్న సాంకేతిక ప్రతిభతో ఆయన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సారధ్యపు అంతరిక్ష కేంద్రం పరిరక్షణ కార్యకలాపాలకు సహకరించారు. తద్వారా నాసా వ్యోమగాముల భద్రతకు తగు చర్యలు చేపట్టారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress