Namaste NRI

బాలకృష్ణకు అరుదైన గౌరవం

అగ్ర నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌(గోల్డ్‌ ఎడిషన్‌)లో ఆయన పేరు చేరింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడు బాలకృష్ణే కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ నెల 30న హైదరాబాద్‌లో బాలయ్యను సత్కరించనున్నారు. గత ఏడాది నటుడిగా 50ఏండ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ,  ఇప్పటికీ స్టార్‌ హీరోగానే కొనసాగుతున్నారు. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సైన్స్‌ ఫిక్షన్‌, బయోపిక్‌  ఇలా అన్ని జానర్లలోనూ నటించిన ఏకైక నటుడు కూడా బాలకృష్ణే కావడం గమనార్హం. ఆయన నటించిన లెజెండ్‌ చిత్రం ఏకంగా 1000రోజులకు పైగా ప్రదర్శితమై అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంతేకాక, ఓవైపు నటుడిగా, మరోవైపు శాసనసభ్యునిగా, ఇంకోవైపు బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ హాస్పిటల్‌ ఛైర్మన్‌గా బరువైన బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా జీవితంలోనూ కీలకంగా ఉన్నారు బాలకృష్ణ. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొనే ఆయనకు ఈ గౌరవం దక్కిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Social Share Spread Message

Latest News