Namaste NRI

దీపికా పడుకోన్‌ కు అరుదైన గౌరవం

బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ ఇండస్ట్రీలో రాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది అగ్ర కథానాయిక దీపికా పడుకోన్‌. ఓం శాంతి ఓం చిత్రంతో హిందీలోకి అరంగేట్రం చేసిన ఈ భామ అక్కడ అనేక హిట్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. హాలీవుడ్‌ సినిమాలతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ మంగళూరు సోయగం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయంగా పేరొందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎమ్‌డీబీ గత దశాబ్దకాలంలో విశేష ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాను విడుదల చేసింది.

ఇందులో దీపికా పడుకోన్‌ తొలిస్థానంలో నిలిచింది. సమంత 13న స్థానంలో ఉంది. టాప్‌ 100 మోస్ట్‌ వ్యూవ్డ్‌ ఇండియన్‌ స్టార్స్‌ పేరుతో గత పదేళ్ల కాలంలో పాపులర్‌ అయిన సినీ తారల జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. ఇందులో అనేక మంది అగ్ర తారలను అధిగమించి దీపికా పడుకోన్‌ నెంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఈ గుర్తింపు తనకు ఎంతో ప్రత్యేకమైనదని, ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ప్రేమను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని దీపికా పడుకోన్‌ ఆనందం వ్యక్తం చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events