Skip to main content

Namaste NRI

పీవీ సింధుకు అరుదైన గౌరవం

 రెండుసార్లు ఒలింపిక్స్‌ పతక విజేత, తెలుగు యువతి సింధుకి మరోసారి అత్యుత్తమ గౌరవం దక్కింది. ఈ ఏడాది బర్మింగ్‌ హోమ్‌ వేదికగా కామన్వెల్త్‌ క్రీడలు జులై 28 నుంచి ప్రారంభం కానున్నాయి. గాయం కారణంగా భారత పతాకధారి నీరజ్‌ చోప్రా ఈ ఈవెంట్‌ నుంచి తప్పుకోవడంతో ఓపెనింగ్‌ సెర్మనీలో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు టీమిండియా ఫ్లాగ్‌ బేరర్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ)  వెల్లడిరచింది. రెండుసార్లు ఒలింపిక్‌ మెడల్స్‌ సాధించిన  సింధుకు గతంలో పలు సందర్భాల్లో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని టీమిండియాను లీడ్‌ చేసిన అనుభవం ఉంది. పీవీ సింధును ఎంపిక చేసిస్తున్నందుకు భారత ఒలింపిక్‌ సంఘం సంతోషం వ్యక్తం చేస్తోంది.

Social Share Spread Message

Latest News