మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. రామ్ చరణ్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఇప్పటికే తమిళనాడు యూనివర్సీటి నుంచి డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ వేడుకకు ముఖ్య అతిథిగా చరణ్ వెల్లనున్నాడు. ఈ విషయన్ని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ సంస్థ ఏర్పడి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుం టుంది. ఈ సందర్బంగా ఆగస్టు 15 నుంచి 25 వరకు వేడుకలు జరుపుకుంటుడగా, ఈ ఈవెంట్‌కు రామ్ చరణ్‌ను ఆహ్వానించింది.
ఈ సందర్భంగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ నిర్వహాకులు మాట్లాడుతూ తమ 15వ ఎడిషన్ కార్యక్రమానికి చరణ్ రావడం మరుపురాని అంశంగా మిగిలిపోతుందని తెలిపింది. ఈ వేడుకలలో చరణ్ నటించిన సినిమాలను ప్రదర్శించనున్నాం. అలాగే భారతీయ కళ మరియు సంస్కృతికి అంబాసిడర్ బిరుదును కూడా రామ్ చరణ్‌కు ప్రదానం చేయనున్నట్టు తెలిపింది.