గతేడాది హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన కామెడీ బ్లాక్ బస్టర్ సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వం. ఈ చిత్రం 2023 జూన్ 28న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కేవలం మౌత్ టాక్‌తో ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.19.8 కోట్లు వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించినందుకుగాను తాజాగా అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈ సినిమాకు దర్శక రత్న దాసరి నారాయణ రావు అవార్డు వరించింది.
ఉత్తమ వినోదాత్మక చిత్రంగా సామజవరగమన ఈ అవార్డును అందుకుంది. ఇక ఈ అవార్డును చిత్ర నిర్మాత రాజేష్ దండా టాలీవుడ్ సినీయర్ నటుడు మురళి మోహన్, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చేతు మీదుగా అందుకున్నాడు. శతాధిక చిత్రాల దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని ప్రతియేట మే 5వ తేదీన డీఎన్‌ఆర్ ఫిల్మ్స్ అవార్డ్స్‌ను ప్రదానం చేయబోతున్నట్లు నిర్వహాకులు కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.