Namaste NRI

అరుదైన ఘనత.. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్‌

ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్‌ అరుదైన ఘనత సాధించారు. ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా సీనియర్‌ భారత రాయబారి 1987 ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారిణి రుచిరా కాంబోజ్‌ బాధ్యతలను స్వీకరించారు. భారత్‌ పక్షాన ఐరాసలో మొట్టమొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా బాధ్యతలు స్వీకరించారని యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ అంటోనియో గుట్రెస్‌ తెలిపారు. మనదేశం నుంచి ఈ రికార్డు సాధించిన మొదటి మహిళ ఆమె కావడం విశేషం. జూన్‌లో ఆమె నియామకం ఖరారు కాగా, దానికి సంబంధించి పత్రాలపే ఐరాస జనరల్‌ సెక్రటరీ ఆంటోనియ గుటెర్రస్‌కు సమర్పించారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుట్రెరస్‌కు శాశ్వత ప్రతినిధిగా నా పత్రాలను సమర్పించారు. భారత్‌కు చెందిన ఒక మహిళకు తొలిసారి ఈ పదవి దక్కడం ఒక గొప్ప గౌరవం. మహిళలందరికీ నేను చెప్పేదొక్కటే మనం ఏదైనా సాధించగలం అని ఆమె బాధ్యతలు స్వీకరిస్తోన్న చిత్రాన్ని షేర్‌ చేశారు. 1987లో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ ఎంపికైన రుచిరా కాంబోజ్‌ (58) టీఎస్‌ తిరుమూర్తి స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events