Skip to main content

Namaste NRI

దోబారా చిత్రానికి అరుదైన అవకాశం

దోబారా చిత్రానికి అరుదైన అవకాశం లభించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్వప్‌ తెరకెక్కించారు. 2018లో విడుదలైన స్పానిస్‌ చిత్రం  మిరేజ్‌ కు రీమేక్‌ గా ఈ సినిమా రూపొందింది. తాప్సి పన్ను ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మెల్‌బోర్న్‌ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తొలి చిత్రంగా ప్రదర్శించనున్నారు. ఆగస్టు 12 నుంచి 20 వరకు సాగే ఈ  చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి తాప్సి, అనురాగ్‌ వెళ్లనున్నారు.  ఈ సందర్భంగా తాప్సి మాట్లాడుతూ ఈ అరుదైన గౌరవానికి చాలా ఆనందంగా ఉంది. మా కష్టమేంటో మెల్‌బోర్న్‌లో ప్రదర్శించుకున్నాం. నన్ను ఇందులో ముఖ్య పాత్రకు ఎంపిక చేసుకున్నందుకు అనురాగ్‌కు  కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News