నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడా భీంగల్ గ్రామానికి గుర్రపు శైలేష్ (23) అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. తన కారులో వెళుతుండగా న్యూజెర్సీలోని సైల్టన్ కూడలి వద్ద మరోవైపు నుంచి వేగంగా వచ్చిన కారు నేరుగా పెట్రోల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో గుర్రపు శైలేష్ సజీవ దహనమయ్యాడు. తండ్రి సత్యం గల్ఫ్ దేశానికి వెళ్లి తిరిగి వచ్చారు. తల్లి గృహిణి కాగా మృతుడి చెల్లెలు ఇద్దరు ప్రస్తుతం ఉన్నత చదువు చదువుతున్నారు. గుర్రపు శైలేష్ గతేడాది 2022 సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లి బయో మెడికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు.