హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం స్పైయాక్షన్ థ్రిల్లర్ వార్-2. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రిలీజ్ చేస్తున్నది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్ జోరు పెంచింది.

అవన్ జావన్ అనే రొమాంటిక్ గీతాన్ని విడుదల చేశారు. తెలుగులో ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్నందించారు. ఊపిరి ఊయలలాగా అంటూ చక్కటి భావాలతో ఈ పాట సాగింది. ప్రీతమ్ బాణీ సమకూర్చిన ఈ పాటను శాశ్వత్‌సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు. హృతిక్‌రోషన్, కథానాయిక కియారా అద్వాణీలపై ఈ పాటను చిత్రీకరించారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యచోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.
















