Namaste NRI

ప్రపంచ రాజకీయాల్లో ఓ సంచలనం..  యూకేలో ప్రత్యక్షమైన జెలెన్స్కీ

 ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆకస్మిక పర్యటన నిమిత్తం బ్రిటన్ చేరారు. బ్రిటీష్ ప్రధానమంత్రి రిషి సునక్ ఆయనను కలిసేందుకు విమానాశ్రయానికి వచ్చారు. ఈ విషయాన్ని రిషి సునక్  వెల్లడించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు అనుకోని అతిథిలా యూకే వచ్చాడు. జెలెన్స్కీ వస్తున్న సమాచారం మేరకు ఆయనకు స్వాగతం చెప్పేందుకు బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ ఎయిర్‌పోర్టుకు  వచ్చారు. జెలెన్స్కీని సాదరంగా ఆహ్వానించిన రుషి,  అక్కడి నుంచి ఇద్దరూ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ చేరుకున్నారు. కింగ్ చార్లెస్‌ని  కలిసేందుకు ఆయన కొద్ది సేపటి క్రితం బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు  బయల్దేరి వెళ్లాడు. జెలెన్స్కీ పర్యటన నేపథ్యంలో ఉక్రెయిన్‌కు  బ్రిటీష్ సైనిక మద్దతును పెంచుతుందని, వారి పైలట్లకు నాటో ఫైటర్ జెట్లపై శిక్షణ ఇవ్వాడనికి బ్రిటన్ వీలుకల్పిస్తుందని భావిస్తున్నారు. యూకే పార్లమెంట్లో జెలెన్స్కీ ప్రసంగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events