దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్‌లోని ప్రతి పక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అందువల్లే దేశంలో అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చిందని తెలిపారు. పొరుగుదేశం ఉత్తర కొరియాకు అనుకూలంగా ప్రతి పక్షాలు పార్లమెంట్‌ను కట్టడి చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలోని ఉత్తర కొరియా అనుకూల శక్తుల్ని నిర్మూలిస్తానని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు. మార్షల్ లా విధింపుతో ఏర్పడే అసౌకర్యాన్ని సహనంతో భరించాలని ప్రజల్ని కోరారు. వీలైనంత తొందర్లో దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు.