
ప్రధాని హోదాలో తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న రిషి సునాక్‌కు రాబోయే ఎన్నికలు సవాల్‌గా మారాయి. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల తేదీ (జూలై 4) ప్రకటించిన కొద్ది గంటల్లోనే రిషి సునాక్ పట్ల అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల నుంచి విముఖత వ్యక్తమైంది. ఈసారి ఎన్నికల పోటీలో తాము నిలబడబోమని అంటూ కన్జర్వేటివ్ ఎంపీలు ప్రకటించటం సంచలనంగా మారింది. వీరి సంఖ్య ఆదివారం నాటికి 78కి చేరుకుంది. దీంతో ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా, ప్రధాని రిషి సునాక్ తన వ్యక్తిగత సహాయకులతో చర్చలు జరిపారు.
