Namaste NRI

మిసెస్ ఇండియా 2024‌ ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

రాజస్థాన్, జైపూర్‌లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శృతి చక్రవర్తి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో ప్రతిభావంతులైన మరో 20 మంది పోటీదారులతో పోటీపడిన శృతి చక్రవర్తి ఫైనల్లో ఫస్ట్ రన్నరప్‌ గా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఈ విజయంతో హైదరాబాద్ చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ ప్రయాణంలో ఆమె ప్రదర్శించిన గ్రేస్, ఛార్మ్ ఎందరో హృదయాలను గెలుచుకుంది. సాఫ్ట్‌ వేర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ చేసి ఈ అందాల పోటీలోకి ప్రవేశించిన శృతి ఇందులో తన విద్యా నైపుణ్యం, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి అంకితమైన గృహిణి పాత్ర వరకు తన బహుముఖ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిం చింది.

ఫస్ట్ రన్నరప్, ఇది కేవలం అవార్డ్ మాత్రమే కాదు. ఈ అవార్డుతో ఆమె ఇలాంటి ఎందరో మహిళలకు, మహిళా సాధికారతకు చిహ్నంగా మారిందని,  పాషన్, కృషి, సంకల్పం ఉంటే, అద్భుతాలు సాధించవచ్చని, ఎలాంటి కలనైనా చేరుకోవచ్చనేదానికి శృతి విజయం స్ఫూర్తిగా నిలుస్తోందని  హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Social Share Spread Message

Latest News