తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషి అద్భుతమని లండన్‌లోని ది ఫెడరేషన్ ఆఫ్ అంబేదరైట్, బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏబీవో-యూకే) ప్రశంసించింది. పాలనలో అంబేదర్ స్ఫూర్తిని కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఎఫ్‌ఏబీవో-యూకే అధ్యక్షుడు సంతోష్‌దాస్, జాయింట్ సెక్రటరీ సీ గౌతమ్ లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌కు ఓ లేఖను అందజేశారు. హుస్సేన్‌సాగర్ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల డాక్టర్ అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణకే కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణం. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, జాతి నిర్మాణానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ చేసిన కృషిని కొనసాగిస్తూ తెలంగాణలో మీరు చేపట్టిన అద్భుత కార్యక్రమాలకు అభినందనలు. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టడం ఆయన పట్ల మీకున్న గౌరవాన్ని తెలియజేస్తున్నది అని లేఖలో కొనియాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఎఫ్‌ఏబీవో-యూకే సతరించింది. విలియం గౌల్డ్, క్రిస్టోఫ్ జాఫ్రెలాట్‌తో కలిసి సంతోష్‌దాస్ రచించిన అంబేదర్ ఇన్ లండన్ పుస్తకాన్ని కేటీఆర్‌కు బహూకరించారు.


