Skip to main content

Namaste NRI

తెలుగు చిత్రసీమలో సమ్మె సైరన్‌… ఆగస్టు 1 నుంచి

తెలుగు చిత్రసీమలో సమ్మె సరైన్‌ మోగింది. ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలు ఆపేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా తర్వాత చిత్ర పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయని, పెరిగిన ఖర్చులకు, వస్తున్న  రాబడికి పొంతన లేక నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గిల్డ్‌ తెలిపింది. ఈ పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేసి తీవ్రంగా నష్టపోతున్నామని, అందుకే ప్రస్తుతం నిర్మాతలెదుర్కొంటున్న సమస్యలన్నింటిపై చర్చించి ఆరోగ్యకరమైన వాతావరనాన్ని తీర్చిదిద్దేందుకు నిర్మాతలంతా స్వచ్ఛందంగా ఆగస్టు 1 నుంచి చిత్రీకరణ నిలిపివేస్తున్నట్లు గిల్డ్‌ పేర్కొంది. ప్రస్తుత సమస్యలన్నీ ఓ కొలిక్క వచ్చేవరకు ఈ బంద్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది.  ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న సినిమాలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు రిలీజ్‌కు వెళ్లవచ్చు అని ప్రకటించింది.

Social Share Spread Message

Latest News