Namaste NRI

మెగాస్టార్ కూతురిగా దురంధర్ బ్యూటీ!

మెగాస్టార్ చిరంజీవి బాబీతో మెగా 158 సినిమా చేయ‌బోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తెగా ఒక కీలక పాత్ర కోసం పొన్నియిన్ సెల్వన్ ఫేమ్, ధురంధ‌ర్ సినిమా సారా అర్జున్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పాత్ర సినిమాలో అత్యంత కీలకం కానుందని తెలుస్తుంది. అయితే దీనిగురించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతుంది. మ‌రోవైపు చిరంజీవి కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన మూవీగా నిలిచిపోతుందని మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా క‌న్న‌డ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా అనంత‌రం స‌మ్మ‌ర్‌లో అత‌డి విశ్వంభ‌ర చిత్రం కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events