Skip to main content

Namaste NRI

ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు పిలుపు

ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు విజ్ఞప్తి చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ఒక క్లిష్టమైన దశకు చేరుకుందని, దీని ప్రభావం పశ్చిమాసియా ఆవలకు కూడా చేరుకుంటుందని ఆయన హెచ్చరించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇరాన్‌ నుంచి రోజురోజుకు పెరుగుతున్న అణు, క్షిపణి భయాలను తగ్గించేందుకు వాటిని ధ్వంసం చేయడం మీదే తమ మిలిటరీ దృష్టి పెట్టిందన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ దేశాలు, ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర దేశాలు ఇరాన్‌పై ఒత్తిడి తేవడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.


Social Share Spread Message

Latest News