Skip to main content

Namaste NRI

అమెరికాకు ఇరాన్‌ మరో షాక్

అమెరికాకు ఇరాన్‌ మరో షాకిచ్చింది. యూఎస్‌కు చెందిన ఎఫ్‌-15 ఫైటర్‌ జెట్‌ను ఇరాన్‌ కూల్చివేసింది. హొర్ముజ్‌ జలసంధి సమీపంలో ఈ ఫైటర్‌ జెట్‌ను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్టు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. శత్రువుల చొరబాటుకు తమ గగనతల రక్షణ వ్యవస్థ నేర్పిన గుణపాఠమిదని టెహ్రాన్‌ టైమ్స్‌ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నది.

దీనికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ను కూడా విడుదల చేసింది. అయితే దీనిని ఇటు ఇరాన్‌ కానీ, అటు అమెరికా కానీ అధికారికంగా నిర్ధారించ లేదు. కాగా, హొర్ముజ్‌ జలసంధిని 48 గంటల్లోగా తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్తు ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించిన కొన్ని గంటలకే ఈ ఘటన చోటుచేసుకుంది.

Social Share Spread Message

Latest News