Skip to main content

Namaste NRI

ఘనంగా అరెరే… అరెరే… మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల

సింగర్, నటి దియా ప్రతిభను చాటుతూ రూపొందిన అరెరే అరెరే మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో అత్యంత వైభవంగా జరిగింది. బటర్‌ఫ్లై మ్యూజిక్ బ్యానర్‌పై నూతన్ చెకూరి నిర్మించిన ఈ ఆల్బమ్ విడుదల కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, హీరో పూరి ఆకాష్, సంగీత దర్శకుడు రఘు కుంచె, నటులు సమీర్, సాగర్, మిమిక్రీ శివారెడ్డి వంటి సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై ఆడియోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ దియాలోని బహుముఖ ప్రజ్ఞను కొనియాడారు, ఆమె గాత్రం మరియు నటన రెండూ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. రఘు కుంచె మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ప్రతిభ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని, దియా భావ వ్యక్తీకరణ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో దియాతో కలిసి నటించిన పూరి ఆకాష్ ఆమె గాన ప్రతిభను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, యువ కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మిమిక్రీ శివారెడ్డి, నిర్మాత నూతన్ చెకూరి తదితరులు దియా కృషిని అభినందిస్తూ ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

మ్యూజిక్ వీడియో దర్శకుడు క్రాంతి వర్మ, సంగీత దర్శకుడు శరవణ వాసుదేవన్ మాట్లాడుతూ తమ టీమ్ ఎంతో శ్రమించి ఈ ప్రాజెక్ట్‌ను ఒక అందమైన విజువల్ అనుభూతిగా తీర్చిదిద్దారని తెలిపారు. నటి, సింగర్ దియా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రేక్షకుల ఆదరణే తనకు కొండంత బలమని పేర్కొన్నారు. క్రాంతి వర్మ దర్శకత్వంలో, కే అండ్ ఎం రైటింగ్స్ కథతో రూపొందిన ఈ ఆల్బమ్‌కు చందు ఏజే సినిమాటోగ్రఫీ అందించగా, త్వరలోనే ఇది యూట్యూబ్, స్పాటిఫై వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events