Namaste NRI

పాకిస్థాన్ లో అత్యంత అరుదైన సంఘటన 

పాకిస్థానీ మహిళ జీనత్‌ వహీద్‌ (27) గంట వ్యవధిలో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. వీరిలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. రావల్పిండిలోని ఓ దవాఖానలో ఈ నెల 19న ఆమె ప్రసవించారు. ఆమె కు నొప్పులు రావడంతో ఈ నెల 18న దవాఖానలో చేర్పించారు. తల్లీబిడ్డలు ఎటువంటి సమస్యలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఒకేసారి ఆరుగురు బిడ్డలు జన్మించడంతో ఈ దవాఖాన సిబ్బంది చాలా సంతోషం వ్యక్తం చేశారు. వీరికి అవసరమైన వైద్య సంరక్షణ, సదుపాయాలను అందించినట్లు తెలిపారు. వైద్యులు మాట్లాడుతూ, ఇది అత్యంత అరుదైన సంఘటన అని, దాదాపు 45 లక్షల మంది గర్భిణు లలో ఒకరికి మాత్రమే ఈ విధంగా బిడ్డలు జన్మిస్తారని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events