ద్వైపాక్షిక సంబంధాల్ని మెరుగుపర్చుకునేందుకు పోలండ్ బయల్దేరిన ప్రధాని మోదీ రాజధాని వార్సా చేరుకున్నారు. ఇక్కడి మిలటరీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. పోలండ్‌లో దిగాను. ఇక్కడ వివిధ కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నా. ఈ పర్యటన ఇరు దేశాల స్నేహానికి ఊపుని స్తుంది. ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది అంటూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. యూరప్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పోలండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటిస్తున్నారు. దాదాపు 45 ఏండ్ల తర్వాత, మళ్లీ ఇన్నేండ్లకు భారత ప్రధాని పోలండ్‌లో పర్యటిస్తున్నారు.
భారత్-పోలండ్ ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 70 ఏండ్లు అవుతున్న సందర్భంగా, ఇరు దేశాల నేతల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఆగస్టు 23న ప్రధాని మోదీ ట్రెయిన్ ఫోర్స్ వన్ లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు వెళ్లటం ఇదే తొలిసారి.