
కెనడాలో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వ్యక్తులపై దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, మరో భారత సంతతి యువకుడు దుండగుల కాల్పుల్లో మరణించాడు. బ్రిటిష్ కొలంబియాలోని బర్నబీలో ఈ ఘటన జరిగింది.ఈ నెల 22న సాయంత్రం 5.30 గంటలకు బర్నబీలోని కెనడావే 3700 బ్లాక్‌లో 28 ఏండ్ల దిల్‌రాజ్ సింగ్ గిల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఇది గ్యాంగ్‍వార్‍లో భాగమై ఉండొని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో కెనడా వే 300 బ్లాక్‌లో జరిగిన కాల్పుల గురించి సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కానీ, తీవ్రంగా గాయపడిన దిల్‌రాజ్ అప్పటికే చనిపోయాడని, అతడికి నేరచరిత్ర ఉందని అధికారులు పేర్కొన్నారు.















