అది పినిశెట్టి కథానాయకుడిగా అరివళగన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సూపర్ నాచురల్ క్రైమ్ థ్రిల్లర్ శబ్దం. 7జీ శివ చిత్రానికి నిర్మాత. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ముంబై, చెన్నైల్లోని అనేక ప్రదేశాల్లో ఈ సినిమాను చిత్రీకరించామని, కేవలం ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే రెండుకోట్లు ఖర్చుపెట్టి 120ఏళ్ల నాటి లైబ్రరీ సెట్ నిర్మించామని, ఆది పినిశెట్టి కెరీర్‌లోనే ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుందని మేకర్స్ చెప్పారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీమీనన్, రెడిన్ కింగ్ల్సీ, ఎం.ఎస్.భాస్కర్, రాజీవ్ మీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సంగీతం: తమన్, సహనిర్మాత: భానుప్రియ శివ, నిర్మాణం: 7జీ ఫిల్మ్స్, అల్ఫా ఫ్రేమ్స్.