Namaste NRI

ఆది సాయి కుమార్ సైరాబాను ప్రారంభం

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సైరాభాను. బంధవి శ్రీధర్‌ కథానాయిక పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో కిరణ్‌ అబ్బవరం క్లాప్‌నివ్వగా, దర్శకుడు రామ్‌ అబ్బరాజు, సాయికుమార్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు.

రాజమండ్రి, హైదరాబాద్‌ నేపథ్యంలో సాగే హిందూ-ముస్లిం ప్రేమకథ ఇదని, ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెడతామని నిర్మాత రాజేష్‌ దండా తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, ప్రొడక్షన్‌ డిజైనర్‌: బ్రహ్మ కడలి, సహనిర్మాత: కృష్ణకాంత్‌ పరుచూరి, రచన-దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events