Namaste NRI

రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్‌ : నిహారిక కొణిదెల

సంగీత్‌శోభన్‌, నయన్‌సారిక జంటగా మానసశర్మ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ అడ్వెంచర్‌ రాకాస శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడారు. విడుదలైన ప్రతీచోట రాకాస చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని ఆనందం వ్యక్తం చేసింది. ప్రీమియర్ల నుంచే తమ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చిందని, ప్రేక్షకుల్ని రెండున్నర గంటల పాటు నవ్విస్తున్నదని చెప్పింది.

పిల్లలతో సహా పెరేంట్స్‌ కూడా సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారని, ఇదొక నాన్‌స్టాప్‌ ఫన్‌రైడ్‌ అని హీరో సంగీత్‌ శోభన్‌ తెలిపారు. చాలా చోట్ల ప్రేక్షకులు పగలబడి నవ్వుతున్నారని, ఈ సినిమా విషయంలో అంచనాలన్నీ నిజమయ్యాయని దర్శకురాలు మానసశర్మ తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News