Namaste NRI

ఫార్మా కంపెనీలకు డొనాల్డ్ ట్రంప్ షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ పేటెంట్‌ ఔషధాలపై ఏకంగా 100 శాతం దిగుమతి సుంకాలు విధించాలని నిర్ణయించారు. దీంతో పేటెంట్‌ కలిగిన స్పెషా లిటీ డ్రగ్స్‌, కీలకమైన ఔషధ ముడి పదార్థాలను ఎగుమతి చేసే భారతీయ కంపెనీలపై ఈ భారం తక్షణమే పడనుంది. అమెరికా మార్కెట్‌పై భారీగా ఆధారపడిన ఫార్మా కంపెనీలు అక్కడ తమ తయారీ కేంద్రా లను నెలకొల్పాలని లేకపోతే భారీ పన్నులు చెల్లించాలనే ట్రంప్‌ నిబంధనలు అంతర్జా తీయ ఫార్మా వాణిజ్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలైన ఐర్లాండ్‌, జర్మనీలకు కొంత పన్ను మినహాయింపు లభిం చినా.. భారత్‌ వంటి దేశాల పేటెంట్‌ ఉత్పత్తులకు ఈ వెసులుబాటు లేకపోవడం ఇక్కడి కంపెనీల పోటీతత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఫార్మా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి.

భారత్‌ నుండి అమెరికాకు వెళ్లే ఔషధ ఎగుమతుల్లో 90 శాతం వరకు చౌకగా లభించే జెనరిక్‌ మందు లపై ఈ ముప్పు ఉండదని ఆ వర్గాలు తెలిపాయి. అయిన ప్పటికీ ప్రస్తుతం మినహాయింపు పొందిన జెనరిక్‌ మందుల భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మినహా యింపు కేవలం ఏడాది కాలా నికేనని ఆ తర్వాత అమెరికా వాణిజ్య శాఖ దీన్ని పున: పరిశీలిస్తుందని ప్రకటించడం భారత ఫార్మా రంగానికి పెద్ద హెచ్చరికగా మారింది.

Social Share Spread Message

Latest News