టెక్ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మానసిక ఆరోగ్యం, ఆలోచనా శక్తిపై ఆయన ఆత్మకథా రచయిత సేట్ అబ్రంసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మస్క్ ప్రభావం, ఆయన చర్యలు అమెరికాకు ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెట్టగలవని హెచ్చరించారు. మస్క్ మానసిక రోగిగా మారుతున్నారని ఆరోపిస్తూ అమెరికా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. మస్క్ ప్రవర్తనను గత రెండేళ్లుగా చాలా దగ్గర నుంచి తాను చూశానని అబ్రంసన్ తెలిపారు. మానసిక అనారోగ్యం, అధిక మోతాదులో మందుల వాడకం, తీవ్ర ఒత్తిడి వంటి సమస్యలను మస్క్ ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఎలాన్ మస్క్ నుంచి అమెరికాను రక్షించాలంటూ అబ్రంసన్ పిలుపునిచ్చారు.