Namaste NRI

శ్రీలంకలో యాక్షన్‌ మొదలు

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా ఇటీవల వైజాగ్‌లో 30 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. సముద్రం నేపథ్యంలో కొన్ని కీలక ఘట్టాల ను తెరకెక్కించారు. తాజా సమాచారం ప్రకారం తదుపరి షెడ్యూల్‌ను శ్రీలంకలో జరుపబోతున్నారని తెలిసింది. దాదాపు మూడు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటారని చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events