Namaste NRI

ఆదికేశవ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల

వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ఆదికేశవ. శ్రీలీల కథానాయిక. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎస్‌.నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ  చిత్రంలో రాధిక, జోజు జార్జ్‌, అపర్ణాదాస్‌, సుదర్శన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.ఈ సందర్బంగా వైష్ణవ్‌తేజ్‌ మాట్లాడారు. అందరికీ నచ్చే సినిమా చేయడానికి మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్‌ మాదిరిగానే సినిమా కూడా అందరినీ మెప్పిస్తుందని నా నమ్మకం అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ  యాక్షన్‌, ఎమోషన్స్‌, కామెడీ అన్నీ ఉన్న సినిమా ఇది అన్నారు. ఈ ఏడాది విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత వస్తున్న పర్‌ఫెక్ట్‌ మాస్‌ సినిమా అన్నారు. ఈ నెల 24న గ్రాండ్‌గా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని అన్నారు.ఈ చిత్రానికి సంగీతం: జీవి ప్రకాశ్‌కుమార్‌. కెమెరా: డడ్లీ, సమర్పణ: శ్రీకర స్టూడియోస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events