Namaste NRI

ఆదిపురుష్‌ ట్రైలర్‌ విడుదల..పండగ చేసుకుంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆది పురుష్ ట్రైలర్ విడుదలైంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ టైటిల్ రోల్‌ పోషిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. మైథలాజిక‌ల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్‌ రాముడిగా నటిస్తుండగా, బాలీవుడ్ భామ కృతిస‌న‌న్ సీత పాత్రలో న‌టిస్తోంది. లక్ష్మణుడిగా స‌న్నీ సింగ్, రావ‌ణాసురుడి (లంకేశ్‌)గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దేవ్‌ద‌త్తా న‌గే హ‌నుమంతుడి పాత్రల్లో న‌టిస్తున్నారు.

టాలీవుడ్ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని రీతిలో వేడుక జరిగింది. చిన్న జీయర్ స్వామి ముఖ్య గెస్ట్ గా వచ్చి సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చాడు. లక్షమందికి పైగా అభిమానులు హాజరైన ఈ వేడుకలో ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ ను చిత్రబృందం తిరుపతిలో విడుదల చేసింది.

 ఫైనల్ ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో గూస్ బంప్స్ తెప్పిచ్చే విధంగా అద్భుతంగా కట్ చేశారు. రావణుడికి భిక్షం వేసేందుకు సీతాదేవి లక్ష్మణ రేఖ దాటగానే ఆమెను అపహరించుకునే వెళ్లే సీన్‌తో ప్రారంభమైన ట్రైలర్.. వానర సేన పోరాటం, హనుమంతుడి సాయం, రాముడి పరాక్రమాన్ని, దుష్ట రావణుడి అంతాన్ని చూపిస్తూ ఫైనల్ ట్రైలర్‌ను ఆసక్తిని పంచేలా కట్ చేశారు. ఈ విజువల్స్ 3డీలో చూస్తే మాత్రం వేరే లెవల్ అని స్పష్టమైపోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ ను మరో స్థాయికి తీసుకెళ్తుందనడంలో సందేహమే లేదు. ఇక ఫైనల్ ట్రైలర్ తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయిపోయాయి. ముఖ్యంగా ట్రైలర్ లో పలు డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం 2023 జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events