అడివి శేష్ కథానాయకుడిగా రూపొందుతోన్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా డకాయిట్. షనైల్ డియో దర్శకత్వం. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి అడివి శేష్, షానీల్ డియో కలిసి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. తర్వాత మహారాష్ట్రలో లాంగ్ షెడ్యూల్ ఉంటుంది.
అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా డెకాయిట్ వరల్డ్‌లోకి కథానాయిక మృణాల్ ఠాకూర్‌ని స్వాగతిస్తూ, అడివి శేష్, మృణాల్ ఠాకూర్ పాత్రల మధ్య కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తూ రెండు పోస్టర్లని మేకర్స్ విడుదల చేశారు. తనకు ద్రోహం చేసిన తన ఎక్స్ లవర్‌పై ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి కథగా డెకాయిట్ రూపొందుతున్నదని, మనసులకు హత్తుకునే ప్రేమకథతో కూడిన ఉద్వేగపూరిత యాక్షన్ ఎంటైర్టెనర్ ఇదని, మృణాల్ తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన పాత్ర చేస్తున్న దని అడివి శేష్ తెలిపారు. డెకాయిట్ లో భాగం అవుతున్నందుకు మృణాళ్ ఠాకూర్ ఆనందం వెలిబుచ్చింది. ఇందులో అడివి శేష్, మృణాల్ పాత్రలు విలక్షణంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: అన్నపూర్ణ స్డూడియోస్.