అకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. 50 వేల ఏండ్ల క్రితం కనిపించిన ఓ ఆకుపచ్చ తోకచుక్క భూమికి అత్యంత చేరువగా వచ్చింది. ఊర్ట్ అనే రహస్య ప్రాంతంనుంచి బయలుదేరిన ఈ తోకచుక్క గురువారం రాత్రి ఉత్తరార్థ గోళంలోని ప్రజలకు కనువిందు చేసింది. ఆ సమయంలో భూమినుంచి 42.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు నాసా వెల్లడించింది. కమ్ముకొన్న మబ్బుల కారణంగా కొందరు ఈ తోకచుక్కను చూడలేకపోయారని, భూమికి సమీపానికి వచ్చినప్పుడు ఇది ముదురు ఆకుపచ్చ మచ్చలాగా కనిపించినట్టు పేర్కొన్నది. దీనికి సీ/2022ఈ3 అని నామకరణం చేశారు. మళ్లీ ఇది ఈ నెల 5న కనిపించనున్నది.
