Namaste NRI

13 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత…డమాస్కస్‌లో

దాదాపు 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఖతార్‌ కు చెందిన విమానం సిరియా రాజధాని డమాస్కస్‌ లో ల్యాండ్‌ అయ్యింది. ఖతారీ ఫ్లైట్‌ డమాస్కస్‌లో ల్యాండ్‌ అయ్యిందని ఎఎఫ్ పి ప్రతినిధులు తెలిపారు. ఖతార్‌లోని దోహా నుంచి బయలుదేరిన వాణిజ్య విమానం డమాస్కస్‌కు చేరుకుంది.  సిరియాలో బషర్‌ అల్‌ అసద్‌ నియంత పాలన కారణంగా దాదాపు 14 ఏళ్లుగా అంతర్యుద్ధం కొనసాగింది. దాంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై అక్కడ నిషేధం విధించారు. నెల రోజుల క్రితం తిరుగుబాటుదారులు బషర్‌ అల్‌ అసద్‌ను తరిమికొట్టడంతో తాజాగా అంతర్జాతీయ విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. దాంతో 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఖతార్‌ ఫ్లైట్‌ సిరియాలో దిగింది.  అంతకుముందు డమాస్కస్‌ విమానాశ్రయం నుంచి ఓ విమానం సౌదీ అరేబియాలోని షార్జాకు వెళ్లింది. అది సిరియా నుంచి బయటి దేశానికి వెళ్లిన తొలి విమానం. ఆ విమానం బయలుదేరి వెళ్లిన కొన్ని గంటలకే ఖతార్‌ విమానం డమాస్కస్‌లో ల్యాండ్‌ అయ్యింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events