రష్యా నుంచి వచ్చే ఆయిల్, గ్యాస్ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. రష్యా నుంచి ఈ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవద్దంటూ నిషేధం విధించారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రష్యా డిప్యూటీ పీఎం అలెగ్జాండ్ నొవాక్ మాట్లాడుతూ రష్యా నుంచి భారత్కు ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 1 బిలియన్ డాలర్లు చేరుకున్నాయని తెలిపారు. అంతేకాదు, భవిష్యత్తులో రష్యా గ్యాస్, ఆయిల్ రంగంలో భారత్ నుంచి మరిన్ని పెట్టుబడులను ఆశిస్తున్నాం అని తెలిపారు. రష్యా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులను యూరోపియన్ దేశాలు కూడా పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.














