Skip to main content

Namaste NRI

అమెరికా తర్వాత.. భారత్ వైపు రష్యా చూపు

రష్యా నుంచి వచ్చే ఆయిల్‌, గ్యాస్‌ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. రష్యా నుంచి ఈ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవద్దంటూ నిషేధం విధించారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రష్యా డిప్యూటీ పీఎం అలెగ్జాండ్‌ నొవాక్‌ మాట్లాడుతూ రష్యా నుంచి భారత్‌కు ఆయిల్‌, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 1 బిలియన్‌ డాలర్లు చేరుకున్నాయని తెలిపారు. అంతేకాదు, భవిష్యత్తులో రష్యా గ్యాస్‌, ఆయిల్‌ రంగంలో భారత్‌ నుంచి మరిన్ని పెట్టుబడులను ఆశిస్తున్నాం అని తెలిపారు. రష్యా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులను యూరోపియన్‌ దేశాలు కూడా పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News