Namaste NRI

ఆ దేశంలో నాలుగు నెలల తర్వాత.. ఇదే తొలిసారి

అంటార్కిటికాలో నాలుగు నెలల సుదీర్ఘ చీకటి తరువాత సూర్యుడు ఉదయించాడు. యూరోపియ్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ఈ విషయాన్ని వెల్లడిరచింది. తాము సూర్యోదయాన్ని చూసినట్లు అక్కడి కాంకోర్డియా పరిశోధన కేంద్రంలోని 12 మంది సభ్యుల బృందం తెలిపింది. శీతాకాలం తరువాత అంటార్కిటికాలో తలి సూర్యోదయం  ఫోటోలను వైద్యుడు హన్నెస్‌ హగ్సన్‌ తీయగా, ఈఎస్‌ఏ వాటిని విడుదల చేసింది.  అంటార్కిటికాలో రెండు కాలాలు మాత్రమే ఉంటాయి. ఒకటి వేసవి, రెండవది శీతాకాలం. ఎప్పుడూ మైనస్‌ డిగ్రీలు ఉండే అంటార్కిటికాలో శీతాకాలం ప్రారంభం కాగానే మైనస్‌ 70 నుంచి 80 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి.  అంటార్కిటికాలో చివరిసారిగా మే 3న సూర్యాస్తమయం అయింది. ఆ తరువాత సూర్యుడు కనిపించడం ఇదే తొలిసారి. ఈ కాలంలో సూర్యుడన్న మాటే ఉండదు. ఆగస్టు వరకు నాలుగు నెలల పాటు చిమ్మచీకటి అలముకుని ఉంటుంది. ఈ చిమ్మచీకటి కాలాన్ని పరిశోధకులు బంగారు గనిగా అభివర్ణిస్తారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events