
భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కోసం చర్చలు ముగిసినట్లు భారత దేశం సోమవారం ప్రకటించింది. ఈ ఒప్పందంపై మూడు నెలల్లోగా సంతకాలు జరుగుతాయని, ఆ తర్వాత అమల్లోకి వస్తుందని సమాచారం. భారత దేశం ఎగుమతి చేసే వస్తువులను నూటికి నూరు శాతం న్యూజిలాండ్ మార్కెట్‌లోకి అనుమతించడం, వీటిపై ఎటువంటి సుంకాలు విధించకపోవడం ఈ ఒప్పందంలో ముఖ్యాంశం. 5,000 మంది ప్రొఫెషనల్స్‌కు టెంపరరీ ఎంప్లాయ్‌మెంట్ ఎంట్రీ వీసాలు, 1,000 వర్క్, హాలిడే వీసాలు ఇవ్వడానికి కోటాను నిర్ణయించారు. రానున్న 15 ఏండ్లలో భారత్‌లో 20 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి న్యూజిలాండ్ అంగీకరించింది.















